దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 10, 12వ తరగతి పరీక్షల కోసం.. సీబీఎస్ఈ 15వేల కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు.
జులై 1 నంచి జరగనున్న ఈ పరీక్షల్లో.. విద్యార్థులు భౌతిక దూరం పాంటించేందుకు, వారి ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మార్చి 25న విధించిన లాక్‌డౌన్‌తో వాయిదా పడిన పరీక్షలను జులై 1 నుంచి 15 వరకు నిర్వహించేందుకు సిద్ధమైంది సీబీఎస్ఈ.
గతంలో 3వేల కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. కానీ ఇప్పుడు 10, 12వ తరగతుల పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 15వేలకుపైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
రమేష్ పోఖ్రియాల్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి
విద్యార్థులు ఇతర పరీక్షా కేంద్రాల్లో కాకుండా సొంత పాఠశాలలోనే పరీక్షలకు హాజరవుతారని ఇదివరకే మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. అంతే కాకుండా, కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయరాదని హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్జామ్ హాల్స్‌కు విద్యార్థులు చేరుకునేందుకు రవాణా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని పేర్కొంది.
ఇదీ చూడండి:సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇదే...