తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2021, 7:52 PM IST

ETV Bharat / bharat

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ ఎప్పుడో తెలుసా?

సీబీఎస్ఈ 10,12 వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్​ను ఫిబ్రవరి 2న వెల్లడించనున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్.

educational minster to announce CBSE exam schedule
సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ ఎప్పుడో తెలుసా?

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల షెడ్యూల్‌ సిద్ధమైంది. ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 2న వెల్లడించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. అలాగే, విద్యార్థులకు చెందిన 40 ఏళ్ల రికార్డులను సీబీఎస్‌ఈ డిజిటిలైజ్‌ చేయనుందని గురువారం తెలిపారు.

సీబీఎస్‌ఈ 10,12వ తరగతుల బోర్డు పరీక్షలను ఈ ఏడాది మే 4 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించనున్నట్టు డిసెంబర్‌ 31న మంత్రి ప్రకటించారు. ఈ పరీక్ష ఫలితాలు జులై 15న వెల్లడిస్తామని కూడా ఆయన చెప్పారు. సాధారణంగా అయితే, ఏటా ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరిలో, రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. 2021లో బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు స్పష్టంచేసింది.

ఇదీ చదవండి:'హింసను ప్రేరేపించే వార్తా ప్రసారాలపై చర్యలేవి?'

ABOUT THE AUTHOR

...view details