దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాలయాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఈశాన్య దిల్లీ మినహా ఎవరికీ పరీక్షలు ఉండవని చెప్పారు.
'దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు'
పదో తరగతి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్. ఈశాన్య దిల్లీ మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని చెప్పారు. ఈశాన్య దిల్లీకి చెందిన విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయాలని స్పష్టం చేశారు.
'పదో తరగతి పరీక్షల నిర్వహణ ఇప్పట్లో కాదు'
ఈశాన్య దిల్లీ విద్యార్థులకు మాత్రం.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 10 రోజుల సమయం ఇస్తామని ట్వీట్ చేశారు పోఖ్రియాల్.
ఇదీ చూడండి:అదిరే మాస్క్‌తో ఫొటో కొట్టు- రూ.5వేలు బహుమతి పట్టు!
Last Updated : May 5, 2020, 7:40 PM IST
TAGGED:
ramesh pokriyal