ఇంటెల్, సీబీఎస్ఈ సంస్థలు ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాయి. 24 గంటల్లోనే అత్యధిక మందికి ఆన్లైన్లో 'కృత్రిమ మేధ'(ఏఐ) పాఠం చెప్పి.. గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాయి. ఎనిమిది ఆపై తరగతులకు చెందిన 13,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
'అందరూ తెలుసుకోవాలి'..
ఇంటెల్, సీబీఎస్ఈ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన యూత్ వర్చువల్ సింపోసియం కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణను నిర్వహించాయి. అక్టోబర్ 13, 14 తేదీల్లో ఈ తరగతులు జరిగాయి.
"రాబోయే రోజుల్లో సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రాథమిక దశలోనే ప్రతి విద్యార్థి.. ఏఐ గురించి తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంతో ప్రపంచ రికార్డును సృష్టించిన ఇంటెల్, సీబీఎస్ఈ సంస్థలకు అభినందనలు."
-- బిస్వజిత్ సాహా, సీబీఎస్ఈ ట్రైనింగ్స్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్.