సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 92.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 2.31శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
500 మార్కులకు 499 మార్కులు సాధించి 13 మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. 24 మంది రెండో ర్యాంకు, 58 మంది విద్యార్థులు మూడో ర్యాంకు సాధించారు.
ప్రాంతాలవారీగా...
ప్రాంతాల వారీగా కేరళలోని త్రివేండ్రం 99.85 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. చెన్నై, అజ్మేర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.