కరోనా నివారణకు ప్రభుత్వాలతో పాటు పలు సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. విద్యార్థుల మధ్య తగిన దూరంలో కూర్చుబెట్టేలా ఏర్పాట్లు చేయాలని పరీక్షా కేంద్రాలను ఆదేశించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ). ఇన్విజిలేటర్లు మాస్కులు లేదా చేతి రుమాళ్లు ధరించాలని సూచించింది.
"ఇద్దరు విద్యార్థుల మధ్య మీటరు దూరం ఉండేలా కూర్చోబెట్టాలి. పరీక్షా కేంద్రాల్లో గదులు సరిపోకపోతే వేరే గదుల్లో కూడా కూర్చోపెట్టవచ్చు. ఇది పరీక్ష కేంద్రాల భాద్యత. ఇన్విజిలేటర్లు మాస్కులు ధరించాలి."