కర్ణాటకలో రాజకీయంగా చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్-కాంగ్రెస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నమోదైన కేసును సీబీఐకి అప్పగించాలని తీర్మానించింది.
"ఫోన్ ట్యాపింగ్ సమస్యపై నిజానిజాలు రాబట్టేందుకు సీఎల్పీ నేత సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలు దర్యాప్తునకు డిమాండ్ చేశారు. కాబట్టి సీబీఐ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించాము. సోమవారం ఆదేశాలు ఇస్తాం. పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష."
- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
అలా మొదలు...
గతవారం హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వంపై రెబల్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ రాజకీయ బాంబు పేల్చారు. సుమారు 300మందికిపైగా నేతల ఫోన్ ట్యాప్ చేసి, గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి తెలిసే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు విశ్వనాథ్.