బాబ్రీ కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును.. సవాల్ చేయాలని భావిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ అంశంలో న్యాయ విభాగాన్ని సంప్రదించిన అనంతరం.. నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది సీబీఐ.
''తీర్పునకు సంబంధించిన పూర్తి కాపీ వచ్చిన తర్వాత.. దానిని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపిస్తాం. న్యాయ విభాగం ఆ తీర్పును పూర్తిగా అధ్యయనం చేస్తుంది. వారి సలహాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటాం.''
- లలిత్ సింగ్, సీబీఐ న్యాయ సలహాదారు
బాబ్రీ మసీదు కేసు తీర్పుపై అప్పీల్ చేస్తారా? అన్న ప్రశ్నకు ఇలా బదులిచ్చారు లలిత్ సింగ్.