తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఐ చేతికి పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు - సీబీఐ

తమిళనాడు పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసింది.

సీబీఐ చేతికి పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు

By

Published : Apr 28, 2019, 1:13 PM IST

Updated : Apr 28, 2019, 2:20 PM IST

పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు విచారణ

తమిళనాడు వ్యాప్తంగా కలకలం సృష్టించిన పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు విచారణలో పురోగతి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు మార్చి నెలలో విచారణ చేపట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ. తాజాగా ఈ కేసులో నిందితులపై రెండు ఎఫ్​ఐఆర్​లు దాఖలు చేసింది సీబీఐ.

వేధింపులు ... బెదిరింపులు

తమిళనాడు వ్యాప్తంగా ఓ ముఠా మహిళలను లైంగికంగా వేధించి, సొమ్ముల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనం రేపింది.

ఆ మూఠా ఫిబ్రవరి 12న ఓ మహిళను వేధించి... ఆపై వీడియోను చిత్రీకరించి వాటితో ఆమెను బెదిరింపులకు గురి చేసింది. వారి నుంచి తప్పించుకున్న మహిళ అదే నెల 24న పోలీసులను ఆశ్రయించడం వల్ల ముఠా దురాగతాలు వెలుగులోకి వచ్చాయి.

అనంతరం బాధితురాలి సోదరుడిపై స్థానిక అన్నాడీఎంకే నేతలు దాడి చేయడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ ఘటనపై రాజకీయం దుమారం రేగింది. ఎందరో మహిళలు వీరి దుశ్చర్యకు బలయ్యారని మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. తీవ్ర ఒత్తిడికి గురైన ప్రభుత్వం... ఘటన తీవ్రతను పరిగణించి కేసును స్వీకరించాలని సీబీఐను కోరింది.

ఇదీ చూడండి: 'వారణాసి గ్రామాల్ని మోదీ సందర్శించారా?'

Last Updated : Apr 28, 2019, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details