కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అక్రమాస్తుల కేసులో తనకు నవంబర్ 19న సమన్లు వచ్చాయని, ఆ సమయంలో తామెవరూ ఇంట్లో లేనట్టు ఆయన తెలిపారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చేసరికి అధికారులు సమన్లు ఇచ్చారని వివరించారు.
"ఈ నెల 23న సాయంత్రం 4గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ అడిగింది. రాష్ట్రంలోని పలు స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, అందువల్ల ఆ తేదీలో సాధ్యం కాదని చెప్పాను. ఈ నెల 25న తిరిగి వస్తానని, అదేరోజు సాయంత్రం హాజరవుతానని చెప్పాను. అందుకు అధికారులు అంగీకరించారు."
- డీకే శివకుమార్