తబ్లీగీ జమాత్ నిర్వాహకులపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. అక్రమ మార్గాల్లో నగదు లావాదేవీలు జరుపుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నిర్వాహకులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అయితే ప్రత్యేకంగా ఏ ఒక్క వ్యక్తి పేరును కూడా సీబీఐ పేర్కొనలేదు.
విదేశీ విరాళాల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయడం లేదని తబ్లీగీ నిర్వాహకులపై ఉన్న ప్రధాన ఆరోపణ. విదేశీ విరాళాల (రెగ్యులేషన్) చట్టం ప్రకారం, ఇతర దేశాల నుంచి సేకరించిన విరాళాల వివరాలను, వాటి ఉద్దేశాన్ని తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయాలి.
సీబీఐ ఇప్పటికే తబ్లీగీ జామాత్ ఆర్థిక లావాదేవీల రికార్డులను ఒక్కొక్కటిగా సేకరిస్తోంది. ఈ ప్రాథమిక విచారణలో 'ప్రైమా ఫేసీ మెటీరియల్'ను సేకరించి.. తరువాత పూర్తి స్థాయి విచారణ చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.