అంతర్జాలంలో చైల్డ్ పోర్న్‌ను అరికట్టే దిశగా చర్యలు ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. బాలలపై లైంగిక దాడుల నివారణ/దర్యాప్తు విభాగం-ఓసీఎస్ఏఈ పేరిట దిల్లీలోని ప్రధాన కార్యాలయలంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది.
సీబీఐ ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగంలో పరిధిలో ఓసీఎస్ఏఈ ఉండనుంది. చైల్డ్పోర్న్ను సృష్టించి, అంతర్జాలంలో వ్యాప్తి చేస్తున్న వారితో పాటు ఆ దృశ్యాల కోసం వెతుకుతున్న, డౌన్లోడ్ చేస్తున్న వారి వివరాలను సేకరించనుంది.