తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోల్​కతా మాజీ కమిషనర్​ కోసం సీబీఐ వేట - tapes

శారదా కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటూ అదృశ్యమైన కోల్​కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్​ కుమార్​ను వెతికేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.

కోల్​కతా మాజీ కమిషనర్​ కోసం సీబీఐ వేట

By

Published : Sep 17, 2019, 5:40 PM IST

Updated : Sep 30, 2019, 11:18 PM IST

శారదా కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలను వరుసగా రెండోసారి ఉల్లంఘించారు కోల్​కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్​కుమార్. ఈ ఉదయం 10 గంటలకు కోల్​కతాలోని సీబీఐ కార్యాలయానికి రావాలంటూ ఇచ్చిన నోటీసులను ఆయన బేఖాతరు చేశారు.

రాజీవ్​​ను వెతికేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. తమ ఎదుట హాజరుకావాలని మాజీ సీపీకి సూచించాలని కోరుతూ బంగాల్ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ లేఖ రాసినట్లు సమాచారం.

రాజీవ్​ను అరెస్టు చేయరాదంటూ కల్పించిన రక్షణను కోల్​క​తా హైకోర్టు శుక్రవారం తొలగించింది. ఆ తర్వాత ఆయన అదృశ్యమయ్యారు. విచారణకు రావాలని రాజీవ్​కు ఇప్పటికే 2 సార్లు నోటీసులిచ్చింది సీబీఐ. అయితే... విచారణకు గైర్హాజరైన ఆయన... ముందస్తు బెయిల్​ కోసం ఈ ఉదయం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఇదీ కేసు...

అధిక లాభాలు వస్తాయని మదుపర్లను మభ్యపెట్టి శారద గ్రూప్ సంస్థలు రూ.2,500 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణ కోసం బంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో అధికారిగా ఉన్నారు రాజీవ్. సాక్ష్యాలను తారుమారు చేశారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ.

ఇదీ చూడండి: 700 కిలోల కేక్​తో మోదీ పుట్టినరోజు వేడుక

Last Updated : Sep 30, 2019, 11:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details