తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీం న్యాయవాదుల ఇళ్లల్లో సీబీఐ దాడులు

సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్​, ఆమె భర్త ఆనంద్​ గ్రోవర్ నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్ట ఉల్లంఘన కేసులో ఈ దాడులు చేసింది సీబీఐ.

సీబీఐ

By

Published : Jul 11, 2019, 12:06 PM IST

కొన్ని రోజులుగా వరుస దాడులను నిర్వహిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ప్రముఖ న్యాయవాది, మాజీ అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఇందిరా జైసింగ్‌, ఆమె భర్త ఆనంద్‌ గ్రోవర్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ దాడులు చేసింది.

సీబీఐ దాడులు

దిల్లీ, ముంబయిలోని ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఉదయం 5 గంటల నుంచి ఏకకాలంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రోవర్​కు చెందిన ఎన్జీఓ... విదేశీ విరాళాల స్వీకరణలో ఉల్లంఘనకు పాల్పడినట్లు కేంద్ర హోం శాఖ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.

భారీగా విరాళాల స్వీకరణ!

ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​లో ఇందిరా జైసింగ్​ పేరు లేకపోయినా హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం కొన్ని గణాంకాలను చూపారు. 2006-07, 2014-15 సమయంలో విదేశాల నుంచి రూ.32.39 కోట్లు విరాళాలుగా సంస్థకు చేరాయని ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయంలో కుట్ర కోణం ఉందని గ్రోవర్​​ తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై చేసిన ఆరోపణల నేపథ్యంలోనే మమ్మల్ని ఇలా వేధిస్తున్నారని ఆక్షేపించారు.

ఇదీ చూడండి: స్పీకర్​ను కలవండి: రెబల్​ ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details