తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ సీపీ నివాసంలో సోదాలు

బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీ చేశారు. ఫోన్ ట్యాపింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు చేసినట్లు అధికారులు చెప్పారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ సీపీ నివాసంలో సోదాలు

By

Published : Sep 26, 2019, 1:39 PM IST

Updated : Oct 2, 2019, 2:05 AM IST

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ సీపీ నివాసంలో సోదాలు

కర్ణాటకలో రాజకీయ దుమారానికి కారణమైన ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ అలోక్​ కుమార్​ నివాసంలో సోదాలు చేపట్టింది.

కుమారస్వామి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో బెంగళూరు నగర పోలీస్​ కమిషనర్​గా అలోక్ కుమార్ విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో కాంగ్రెస్​ ప్రముఖ నేతలు సహా దాదాపు 300 మంది ఫోన్లను స్వామి ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో బెంగళూరు పోలీసులు ఆగస్టులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తర్వాత ఆ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది యడియూరప్ప ప్రభుత్వం.

ఇప్పటికే ఈ కేసులో అనేక మంది పోలీసు అధికారుల్ని విచారించిన సీబీఐ... ఇప్పుడు అలోక్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది.

ఇదీ చూడండి : రాబర్ట్​ వాద్రాను కస్టడీకి అప్పగించండి: ఈడీ

Last Updated : Oct 2, 2019, 2:05 AM IST

ABOUT THE AUTHOR

...view details