తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవినీతిపై 19 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు - దర్యాప్తు

దేశవ్యాప్తంగా సీబీఐ ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. 19 రాష్ట్రాల్లోని 110 ప్రదేశాల్లో దాడులు జరుపుతోంది. అవినీతి, ఆయుధాల అక్రమ రవాణా, నేరప్రవర్తనపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది సీబీఐ.

దేశవ్యాప్తంగా ముమ్మరంగా సీబీఐ సోదాలు

By

Published : Jul 9, 2019, 3:16 PM IST

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దేశవ్యాప్తంగా మూకుమ్మడి సోదాలు నిర్వహిస్తోంది. 19 రాష్ట్రాల్లోని 110 ప్రదేశాల్లో అవినీతి, ఆయుధాల అక్రమ రవాణా, నేరప్రవర్తనలపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై ఒకేసారి దాడులు చేపట్టింది.

ఇటీవల సీబీఐ 30 కేసులు నమోదు చేసిందని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.

దిల్లీ, భరత్​పూర్, ముంబయి, ఛండీగఢ్, జమ్ము, శ్రీనగర్​, పుణె, జైపుర్, గోవా, కాన్పుర్, రాయ్​పుర్, హైదరాబాద్, మధురై, కోల్​కతా, రూర్కెలా, రాంచీ, బోకారో, లఖ్​నవూ సహా ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, బిహార్​ రాష్ట్రాల్లోని పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి.

వారం రోజుల వ్యవధిలో సీబీఐ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి. గత మంగళవారం ఇదే తరహాలో బ్యాంకింగ్ మోసాల కేసుల నిందితుల ఇళ్లల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.

ఇదీ చూడండి: పగ్గాలు: అనుభవానికా.. ఉరకలేసే యువతరానికా?

ABOUT THE AUTHOR

...view details