తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఐ దాడులు ఆపండి... ప్రధానికి విపక్ష ఎంపీల లేఖ - అధికార దుర్వినియోగం

మోదీ ప్రభుత్వం న్యాయవాదులపై బెదిరింపులకు పాల్పడుతోందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆనంద్​ గ్రోవర్​​లపై సీబీఐ దాడులను వారు ఖండించారు. ఇది అధికార దుర్వినియోగమని, ఇకనైనా వీటిని ఆపాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/12-July-2019/3814260_cbi.jpg

By

Published : Jul 12, 2019, 5:25 AM IST

Updated : Jul 12, 2019, 7:45 AM IST

సీబీఐ దాడులు ఆపండి... ప్రధానికి విపక్ష ఎంపీల లేఖ

మోదీ ప్రభుత్వం.. ప్రఖ్యాత న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వం.. ఇటువంటి బలవంతపు, బెదిరింపు చర్యలను ఆపాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖరాసింది విపక్ష పార్టీ ఎంపీల బృందం. ఇందులో కాంగ్రెస్​, తృణమూల్​, ఎస్పీ, సీపీఎం ఉన్నాయి.

సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ఆనంద్ గ్రోవర్​కు చెందిన దిల్లీ, ముంబయిల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. వీరు విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించి (ఎఫ్​సీఆర్​ఏ) నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన సీబీఐ... నిందితురాలిగా ఇందిరా జైసింగ్​ పేరు చేర్చనప్పటికీ ఆమె ప్రమేయం ఉన్నట్లు పేర్కొంది.

అధికార దుర్వినియోగమే..

ఇందిరా జైసింగ్, గ్రోవర్​లు ఇరువురూ మానవహక్కుల రంగంలో గొప్ప కృషి చేశారని, మార్గదర్శకమైన పనులు చేపట్టారని, అధికారులకు పూర్తి సహకారం అందించారని విపక్ష ఎంపీలు కొనియాడారు. అయినప్పటికీ వారిపై సీబీఐ దాడులు జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు.

"మోదీ ప్రభుత్వం తాజాగా న్యాయవాది ఇందిరా జైసింగ్, గ్రోవర్​లపై సీబీఐ దాడుల ద్వారా బలవంతపు బెదిరింపులకు పాల్పడింది. ​ఇది ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే."- మోదీకి రాసిన లేఖలో....కాంగ్రెస్, టీఎం​సీ, ఎస్పీ, సీపీఎం ఎంపీలు

ఇదీ చూడండి: రూ.24.77 కోట్ల విలువైన ఛోక్సీ ఆస్తుల జప్తు

Last Updated : Jul 12, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details