ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత పి. చిదంబరంపై ఈ నెలలో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల క్లియరెన్స్ ఇచ్చినట్లు ఆయనపై అభియోగం ఉంది.
తిహార్ జైలుకు..
ప్రత్యేక న్యాయస్థానం.. చిదంబరానికి 14 రోజుల సీబీఐ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయనను తిహార్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు.. జైలులో ఆయనకు ప్రత్యేక సెల్, వెస్ట్రన్ టాయ్‌లెట్ తప్ప మరే ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని అధికారులు తెలిపారు.