కోల్‌కతా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శారదా కుంభకోణం కేసులో రాజీవ్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. రాజీవ్ కుమార్ కోసం నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
అరెస్టు వారెంట్ ఇవ్వండి
కేసు విచారణకు సహకరించకుండా.. తమ నోటీసులకు స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్న మాజీ సీపీని అరెస్టు చేసేందుకు వారెంట్ ఇవ్వాలని కోల్‌కతా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ.... రాజీవ్ ఫోన్ నెంబర్ కోసం డీజీపీకి లేఖ రాసింది.