సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరిద్దరికీ సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు వారిపై నమోదైన కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేశ్‌కు క్లీన్‌చిట్ - ఎన్నికల
సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు భారీ ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వీరిద్దరికి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో సీబీఐ పేర్కొంది.
ములాయం, అఖిలేశ్‌లు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఎలాంటి ఆధారాలులేవని తెలిపింది సీబీఐ. వీరిద్దరూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారని 2005లో విశ్వనాథ్ చతుర్వేది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ములాయం, అఖిలేశ్‌పై విచారణ చేపట్టాలని 2007లో సీబీఐని ఆదేశించింది.
కేసు పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 11న సీబీఐని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. తాజాగా ప్రమాణపత్రం దాఖలు చేసిన సీబీఐ... ములాయం, అఖిలేశ్ అక్రమాస్తులపై ఆధారాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపింది. 2013లోనే ఆ కేసును ముగించినట్లు వివరించింది.
- ఇదీ చూడండి: రాజీవ్‌కు కాంగ్రెస్ నేతల నివాళులు- మోదీ ట్వీట్