తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​కు సీబీఐ కోర్టు సమన్లు - సీబీఐ ప్రత్యేక కోర్టు

1992 నాటి బాబ్రీ మసీదు కేసులో తిరిగి న్యాయస్థానం మెట్లు ఎక్కనున్నారు యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్​ సింగ్. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని లఖ్​నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేసింది.

బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​కు సీబీఐ కోర్టు సమన్లు

By

Published : Sep 22, 2019, 11:37 AM IST

Updated : Oct 1, 2019, 1:36 PM IST

బాబ్రీ మసీదు​ కేసులో ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత కల్యాణ్​సింగ్​కు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్​ 27న లఖ్​నవూలోని న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది.

1992లో బాబ్రీ మసీదు​ ఘటన జరిగినప్పుడు కల్యాణ్​సింగ్​ ఉత్తర్​ప్రదేశ్​ సీఎంగా ఉన్నారు. 1993లో ఆయనపై ఛార్జిషీటు నమోదైంది. అయితే... తదనంతర కాలంలో రాజస్థాన్​ గవర్నర్​ అయ్యారు కల్యాణ్ సింగ్​. రాజ్యాంగపరంగా ఉన్న రక్షణల కారణంగా బాబ్రీ మసీదు కేసులో నిందితుడిగా ఆయన్ను విచారించడం సాధ్యపడలేదు.

సెప్టెంబర్​ 3న రాజస్థాన్​ గవర్నర్​గా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కల్యాణ్​ను విచారించేందుకు ప్రత్యేక కోర్టును అనుమతి కోరింది సీబీఐ. ఈ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం... సింగ్​కు సమన్లు జారీచేసింది.

ఇదే కేసులో భాజపా అగ్రనేతలు ఎల్​కే అడ్వాణీ, మురళి మనోహర్​ జోషి నిందితులుగా ఉన్నారు.

ఇదీ చూడండి:'హౌడీ మోదీ'తో ఆ దేశాలకు ట్రంప్​ హెచ్చరికలు!

Last Updated : Oct 1, 2019, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details