తెలంగాణ

telangana

By

Published : Jul 2, 2019, 1:59 PM IST

Updated : Jul 2, 2019, 4:03 PM IST

ETV Bharat / bharat

బ్యాంకు మోసాలపై సీబీఐ మెరుపు దాడులు

కేంద్ర దర్యాప్తు సంస్థ... బ్యాంకు మోసాలను చేధించడం కోసం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. పలు కంపెనీలు, వాటి ప్రమోటర్లు, డైరెక్టర్లు, వారికి సహకరించిన బ్యాంకు అధికారులపై 14 కేసులు నమోదు చేసింది.

బ్యాంకు మోసాలపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు

బ్యాంకు మోసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మంగళవారం సోదాలు చేపట్టింది. 18 నగరాల్లోని 50 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. సుమారు 640 కోట్ల రూపాయల మేర బ్యాంకు మోసాలకు పాల్పడిన పలు కంపెనీలు, ఆయా సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లు, వారికి సహకరించిన బ్యాంకు అధికారులపై మొత్తం 14 కేసులు నమోదు చేసింది.

దిల్లీ, ముంబయి, లూథియానా, ఠానే, వల్సాద్​, పుణె, పళని, గయ, గురుగ్రామ్, చంఢీగఢ్​, భోపాల్​, సూరత్​, కోలార్​ తదితర నగరాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు చేపట్టింది.

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి జతిన్​ మెహతాతో సంబంధమున్న ముంబయికి చెందిన విన్సమ్​ గ్రూప్, తయాల్​ గ్రూప్​నకు చెందిన ఎస్కే నైట్​పై సీబీఐ కేసులు నమోదు చేసింది. దిల్లీకి చెందిన నాఫ్టోగాజ్​, ఎస్​ఎల్​ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్​, పంజాబ్​కు చెందిన ఇంటర్నేషనల్ మెగా ఫుడ్​ పార్క్​ లిమిటెడ్​, సుప్రీంటాక్స్ మార్ట్​పైనా కేసులు నమోదు చేసింది సీబీఐ.

ఈ బ్యాంకింగ్ కుంభకోణం మొత్తం విలువ సుమారు రూ.640 కోట్లుగా ఉంటుందని సీబీఐ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:మహారాష్ట్ర: భారీ వర్షాలకు 30 మంది మృతి

Last Updated : Jul 2, 2019, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details