తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ ముఖ్యమంత్రికి చిక్కులు- సీబీఐ కేసు నమోదు - ఉత్తరాఖాండ్​ మాజీ సీఎంపై కేసు

ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్​ మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది.  ఈ కేసు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రికి చిక్కులు- సీబీఐ కేసు నమోదు

By

Published : Oct 23, 2019, 6:59 PM IST

ఉత్తరాఖండ్​ మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

వీడియోనే మూలం...

2016లో ఉత్తరాఖండ్​లో రాష్ట్రపతి పాలన ఉన్నప్పటి ఓ వీడియో ఈ కేసుకు మూలమైంది. కాంగ్రెస్​ పార్టీ​ తిరిగి అధికారంలోకి రావటానికి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై రావత్​ చర్చించినట్లు ఆ వీడియోలో ఉంది.

వీడియో ఆధారంగా ప్రాథమిక విచారణ పూర్తి చేసిన సీబీఐ... ఇటీవలే ఉత్తరాఖండ్​ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... రావత్​పై కేసు నమోదు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి:600ఎకరాల చెరువులో ఒకేసారి కలువలు విరబూస్తే...

ABOUT THE AUTHOR

...view details