తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ ముఖ్యమంత్రి నబం​ తుకిపై అవినీతి కేసు

అరుణాచల్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నబం తుకిపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). 2003లో నిబంధనలకు విరుద్ధంగా రూ.3.20 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టును ఆయన తమ్ముడికి కేటాయించినట్లు పేర్కొంది.

మాజీ ముఖ్యమంత్రి నబం​ తుకిపై అవినీతి కేసు

By

Published : Jul 12, 2019, 9:09 PM IST

ప్రభుత్వ ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతకలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ అరుణాచల్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నబం​ తుకిపై కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. 2003లో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నబం తుకి ఉన్న సమయంలో ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతి జరిగినట్లు పేర్కొంది. రూ.3.20 కోట్ల విలువైన ప్రాజెక్టును టెండర్​ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ్ముడికి కట్టబెట్టినట్లు ఆరోపించింది.

తుకి తమ్ముడు నబం తగమ్​, యునైటెడ్​ కమెర్షియల్​ బ్యాంక్​ చీఫ్​ మేనేజర్​ సొహ్రాబ్​ అలి హజారికాలపైనా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

2011-16 మధ్య కాలంలో అరుణాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు నబం తుకి.

ఇదీ చూడండి: చెట్టెక్కి ఇరుక్కున్నాడు.. వల వేసి కాపాడారు

ABOUT THE AUTHOR

...view details