తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆమ్​ఆద్మీ'కి అనైతిక దెబ్బ-సిసోడియా ఓఎస్​డీ అరెస్ట్!

దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కార్యాలయ అధికారిని సీబీఐ అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. గోపాల్ కృష్ణ మాధవ్ అనే సిసోడియా ఓఎస్​డీ రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అదుపులోకి తీసుకుంది.

CBI arrests OSD to Delhi DyCM
సీబీఐ అరెస్టు

By

Published : Feb 7, 2020, 6:48 AM IST

Updated : Feb 29, 2020, 11:49 AM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కు ముందు ఆమ్​ఆద్మీ పార్టీని ఆత్మరక్షణలో పడేసే ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా ప్రత్యేక అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

జీఎస్​టీకి సంబంధించిన ఓ వ్యవహారంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా మనీశ్​ సిసోడియా ఓఎస్​డీ గోపాల్​ కృష్ణ మాధవ్​ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం సంస్థ కేంద్ర కార్యాలయానికి తరలించారు.

ఇప్పటివరకు ఈ వ్యవహారంలో సిసోడియా హస్తం లేదని తెలుస్తుండగా... దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మనీశ్ సిసోడియాకు ప్రత్యేక అధికారిగా 2015లోనేమాధవ్​నియామకమయినట్లు సమాచారం.

ఇదీ చదవండి: అండర్ 19 కప్పు కోసం భారత్-బంగ్లాదేశ్ ఢీ

Last Updated : Feb 29, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details