ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిల్ మంజూరు చెయ్యవద్దని దిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఈ మేరకు లిఖితపూర్వకంగా కోర్టుకు విన్నవించింది. ఇప్పటివరకూ తాము జరిపిన దర్యాప్తులో ఆయన పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలిందని, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది.
చిదంబరానికి బెయిల్ ఇవ్వద్దు: సీబీఐ - చిదంబరం బెయిల్ పిటిషన్‌పై ఈనెల 23న తిరిగి విచారణ జరగనుంది
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి బెయిల్ మంజూరు చెయ్యొద్దంటూ సీబీఐ దిల్లీ హై కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు తేలిందని పేర్కొంది.
చిదంబరానికి బెయిల్ ఇవ్వద్దు: సీబీఐ
అవినీతి కార్యకలాపాలతో ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారని.. ఒకవేళ చిదంబరంకు బెయిల్ మంజూరు చేస్తే అవినీతి కేసులో తప్పుడు సంప్రదాయానికి న్యాయస్థానం శ్రీకారం చుట్టినట్టు అవుతుందని తెలిపింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై ఈనెల 23న తిరిగి విచారణ జరగనుంది.
Last Updated : Oct 1, 2019, 9:23 AM IST