అంతర్జాతీయ మార్కెట్లో చలామణి అవుతున్న నకిలీ కొవిడ్-19 టెస్టింగ్ కిట్లపై రాష్ట్రాల పోలీసు విభాగాలను అప్రమత్తం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). అంతర్జాతీయ క్రిమినల్ పోలీసు ఆర్గనైజేషన్ (ఇంటర్పోల్) సమాచారం మేరకు పలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ జాబితాలో భారత్కు చెందిన ఏ సంస్థగానీ, సరఫరాదారుగానీ లేరని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు విముఖత వ్యక్తం చేశాయి. ఈ వివరాలు బహిర్గతం చేస్తే.. ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉన్న సంస్థలు అప్రమత్తమయ్యే అవకాశాలున్నాయని వివరించారు ఆ అధికారులు. తప్పుడు టెస్టింగ్ కిట్లపై మొత్తం 194 దేశాలను ఇంటర్పోల్ అధికారులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.