భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
కరోనా రికార్డ్: దేశంలో ఒక్కరోజే 69,652 కేసులు - corona cases
భారత్‌లో కరోనా విజృంభణ నానాటికీ పెరిగిపోతోంది. దేశంలో కొత్తగా 69,652 కేసులు నమోదవ్వగా... మరో 977 మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 28,36,926కు చేరింది.
దేశంలో ఒక్కరోజే 69,652 కేసులు
వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల 86వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 58వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Last Updated : Aug 20, 2020, 11:48 AM IST