తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రమంత్రి పాసవాన్​కు ఉల్లి ధర సెగ..సివిల్​కోర్టులో కేసు

పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రమంత్రి రామ్​విలాస్​పాసవాన్.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సివిల్​ కోర్టును ఆశ్రయించాడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి. ఈ కేసుపై డిసెంబరు 12న విచారణ జరుగనుంది.

Paswan
కేంద్రమంత్రి పాసవాన్​కు ఉల్లి ధర సెగ..సివిల్​కోర్టులో కేసు

By

Published : Dec 8, 2019, 5:15 AM IST

గతంలో ఎన్నడూ లేనంతగా దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​ ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసం చేశారని సివిల్​ కోర్టును ఆశ్రయించాడు ఉత్తర్​ప్రదేశ్ ముజఫర్​పుర్​కు చెందిన ఎం.రాజు నయ్యర్​.

కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పటికీ ఉల్లి ధరలను పాసవాన్​ తెలుసుకోలేకపోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు రాజు. కూరగాయల ధరలు పెరగడానికి అక్రమ నిల్వలే కారణమని చెప్పి ప్రజలను కేంద్రమంత్రి తప్పుదోవ పట్టించారని ఆరోపించాడు. ఈ కేసుపై డిసెంబరు 12న విచారణ చేపట్టనున్నారు చీఫ్ జుడీషియల్​ మెజిస్ట్రేట్​ సూర్యకాంత్ తివారీ.

ఇదీ చూడండి:కేంద్ర ప్రభుత్వం ఇకనైనా నిద్ర మేల్కొనాలి : కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details