తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇండియన్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో 'పెన్సిల్' కళాకారుడు - ఇండియన్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో మొహమ్మద్​ ఆసిఫ్​

కేరళ తిరూరంగడికి చెందిన మహ్మద్ ఆసిఫ్ 16 మీటర్ల పొడవైన​ పెన్సిల్​పై 50 మలయాళం అక్షరాలను తీర్చిదిద్ది ఇండియన్​ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. అలాగే చాక్​పీసులతో జాతీయ నాయకుల ప్రతిమలు, ప్రసిద్ధ కట్టడాల నమూనాలు రూపొందించి తన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

Carving Craft Into Pencil And Chalk Piece
ఇండియన్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో 'పెన్సిల్' కళాకారుడు ఆసిఫ్​

By

Published : Dec 14, 2019, 6:32 AM IST

ఇండియన్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో 'పెన్సిల్' కళాకారుడు

పెన్సిళ్లు​, చాక్​పీసులతో అద్భుత కళాఖండాలు రూపొందించి ఇండియన్​ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు కేరళ తిరూరంగడికి చెందిన మహ్మద్ ఆసిఫ్​. దేవదార్ పాఠశాలలో ప్లస్​టూ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిగా ఉన్న ఆసిఫ్​.. 16 మీటర్ల పొడవైన పెన్సిల్​పై 50 మలయాళం అక్షరాలను తీర్చిదిద్దాడు. ఈ కళాసృష్టికి గుర్తింపుగానే అతడికి ఇండియన్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది.

అలా మొదలైంది...

స్నేహితుడి పుట్టిన రోజు కానుక ఇవ్వడం కోసం సరదాగా ప్రారంభించిన ఈ పెన్సిల్ ఆర్ట్​.. క్రమంగా ఆసిఫ్​లో కళానైపుణ్యం వెలికితీయడానికి దోహదపడింది. చాక్​పీస్​లతో ప్రముఖ జాతీయ నాయకుల బొమ్మలు, ప్రసిద్ధ కట్టడాల నమూనాలు తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు.

"స్నేహితుడి పుట్టినరోజుకు ఏదొక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకున్నాను. ఇన్​స్టాగ్రామ్​లో పెన్సిల్ కార్వింగ్​ చూశాను. అది చూసి చిన్న బొమ్మలా తయారు చేద్దామనుకున్నాను. అక్కడ నుంచి మైక్రో ఆర్ట్​ అలవాటైంది. ఆ తర్వాత ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది. 50 మలయాళం అక్షరాలను 16 సె.మీ పెన్సిల్​పై చెక్కాను. అది ఓ రికార్డ్​ అయింది." - మహ్మద్ ఆసిఫ్​, కళాకారుడు

ఎనలేని గుర్తింపు...

ఆసిఫ్ రూపొందించిన బొమ్మలు, చిత్రాలను స్కూల్ ఆర్ట్ ఎక్స్​పోలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తానూర్ ఎమ్మెల్యే అబ్దుల్ రహ్మాన్​.. ఆసిఫ్​ కళానైపుణ్యానికి అచ్చెరువొందారు. అలా తక్కువ కాలంలోనే ఆసిఫ్​కు ఎనలేని గుర్తింపు లభించింది. ప్రస్తుతం తన కళను కేరళ విద్యాశాఖమంత్రి రవీంద్రనాథ్​ ముందు ప్రదర్శించడానికి ఆసిఫ్ సిద్ధమవుతున్నాడు.

ఇదీ చూడండి: మళ్లీ బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​- కన్జర్వేటివ్​ పార్టీ జయభేరి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details