తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామాలయం ప్రాంతానికి శిలల తరలింపు - stones carved for building the Ram temple.

రామమందిర నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేకంగా చెక్కిన శిలలను కార్యస్థలం నుంచి.. ఆలయ నిర్మాణ ప్రాంతానికి తరలించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ ట్వీట్​ చేసింది.

Carved stones being moved from workshop for construction of Ram Temple
అయోధ్య రామాలయ ప్రాంతానికి శిలల తరలింపు

By

Published : Oct 10, 2020, 11:18 AM IST

అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రామ మందిర నిర్మాణంలో వాడేందుకు ప్రత్యేకంగా చెక్కిన శిలలను కార్యస్థలం నుంచి నిర్మాణ ప్రాంతానికి తరలిస్తున్నారు. పూజారులు శుక్రవారం.. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ శిలల తరలింపు ప్రారంభమైంది. ముందుగా వీటిని ఆలయ పరిసరాల ప్రాంతాలకు తీసుకెళ్లి.. ఆలయంలోని వివిధ భాగాల్లో అమర్చుతారు.

శిలల తరలింపు

రామాలయ మ్యాప్​ అనుమతి కోసం అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 29న అయోధ్య అభివృద్ధి సంస్థ (ఏడీఏ)కు సమర్పించారు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు. అనంతరం.. మ్యాప్​ను సెప్టెంబర్​ 2న ఏకగ్రీవంగా ఆమోదించింది ఏడీఏ.

తరలింపు ప్రక్రియకు ముందు పూజలు
అయోధ్య రామాలయ ప్రాంతానికి శిలల తరలింపు

ఇదీ చూడండి:'రాముని అడుగుజాడల్లో నడిస్తే అభివృద్ధి తథ్యం'

2020 ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ABOUT THE AUTHOR

...view details