రాజస్థాన్ కోటాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు దాదాపు 25 మూగ జీవాలను చంపి మురికి కాలువలో పారేశారని ప్రాథమిక విచారణలో తేలింది.
కోటా, సరోలా మార్గ్, జాతీయ రహదారి పక్కనున్న సుల్తాన్ పుర్ గ్రామంలో.. మురికి కాలువలో పశువుల కళేబరాలు తేలియాడుతూ కనిపించాయి. రెండు డజన్లకు పైగా ఆవులు, గేదెల మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్, విశ్వ హిందు పరిషత్ సంఘాల కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోవులను హత్య చేసినవారిని పట్టుకోవాలని నిరసనలు చేపట్టారు.
"24 గంటల్లో పోలీసులు నేరస్థులను పట్టుకోలేకపోతే.. విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ సంయుక్తంగా దేశవ్యాప్త నిరసనకు పిలుపునివ్వాల్సి వస్తుంది."