తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రియాంక'తో సెల్ఫీ కోసం.. దూసుకొచ్చిన కారు..!

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇంట్లోకి ఓ కారు భద్రతను దాటుకొని వెళ్లింది. నవంబర్​ 25న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సెల్ఫీ దిగేందుకే కొందరు ఇలా చేశారని సమాచారం. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించిన సందర్భంగా.. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

By

Published : Dec 2, 2019, 7:52 PM IST

Updated : Dec 2, 2019, 8:30 PM IST

car-with-seven-people-drives-into-priyankas-residence-security-breach-taken-up-with-crpf
'ప్రియాంక'తో సెల్ఫీ కోసం దూసుకొచ్చిన కారు

కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు భద్రతను దాటుకొని వెళ్లింది. గత నెల 25న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే... దిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు అకస్మాత్తుగా వచ్చింది. ఆ కారులో ఓ అమ్మాయితో పాటు ఐదుగురు ఉన్నట్లు సమాచారం. ప్రియాంక గాంధీతో సెల్ఫీ దిగేందుకు వాళ్లు ఇలా ఎటువంటి అనుమతి తీసుకోకుండా భద్రత కళ్లుగప్పి వచ్చినట్లు తెలుస్తోంది.

గార్డెన్‌లో ఉన్న ప్రియాంక గాంధీ దగ్గరకు ఆ ఐదుగురు వెళ్లడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఎటువంటి ముందస్తు అపాయింట్‌మెంట్‌ లేకుండా ఈ ఐదుగురు ఆమెను కలిసినట్లు సమాచారం.

'ఎస్పీజీ' తొలగించిన నేపథ్యంలో ఘటన...

గాంధీ కుటుంబంలోని సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలకు ఇటీవల.. ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) భద్రతను తొలగించారు. ఎస్పీజీకి బదులుగా కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం(సీఆర్పీఎఫ్‌) ద్వారా జడ్‌ ప్లస్‌ శ్రేణి భద్రత కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలోనే... గుర్తు తెలియని వ్యక్తులు ప్రియాంక ఇంట్లోకి దూసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.

ప్రియాంకతో ఫొటో దిగడం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చినట్లు వాళ్లు చెప్పారు. భద్రతా వైఫల్యం కారణంగా ఇలా జరిగిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

నా దృష్టికి రాలేదు: కిషన్​ రెడ్డి

సెంట్రల్‌ దిల్లీలోని భారీ భద్రత ఉండే లోదీ ఎస్టేట్‌లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాసంలోకి భద్రతా వలయాన్ని దాటి వెళ్లిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పందించారు. ఈ విషయం ఇంకా తన దృష్టికి రాలేదన్నారు. తాను లోక్‌సభ నుంచి వస్తున్నాననీ.. తన కార్యాలయానికి వెళ్లిన తర్వాత దీనిపై చర్చిస్తానని చెప్పారు.

ఇదీ చూడండి:'గాంధీ' కుటుంబ భద్రతా విధుల్లో సీఆర్​పీఎఫ్​

Last Updated : Dec 2, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details