ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో ఓ కారు ప్రమాదానికి గురైంది. బరేలీ నుంచి చండీగఢ్ వెళుతున్న క్రమంలో గాజియాబాద్‌లోని మసురీ ప్రాంతంలో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు ఆచూకీ గల్లంతయినట్లు పోలీసులు తెలిపారు.
" రాత్రి 12 గంటల సమయంలో కారు కాలువలో పడిపోయింది. అదే సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్నాను. నీటిలో చేతులు కనిపించటం వల్ల అందులోకి దూకి కారు డ్రైవర్‌ను కాపాడాను. ప్రమాదం జరిగిన తర్వాత ముగ్గురు కారులోంచి బయటపడ్డారు. కానీ, ఆ తర్వాత వారు కనిపించలేదు. వారి కోసం గాలింపు చేపట్టాం."