పేలుడు సమయంలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణి సమీపంలోనే ఉంది. అయితే... కాన్వాయ్ లక్ష్యంగా దాడి జరగలేదని, వాహనంలోని సిలిండర్ పేలడమే ఇందుకు కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడి చేశారు. పేలుడు పదార్ధాలు నింపిన వాహనంతో జవాన్ల బస్సును ఢీకొట్టారు. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఇప్పుడు సీఆర్పీఎఫ్ వాహనశ్రేణికి సమీపంలో కారు పేలడం అనుమానాలకు తావిచ్చింది.