తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మిలటరీ​ క్యాంటీన్లలో ఇక ఆ ఉత్పత్తులే విక్రయం' - అమిత్​ షా

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర సాయుధ దళాల క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే విక్రయించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటించారు. ఈ నిర్ణయం జూన్​ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. దేశీయ ఉత్పత్తులను వినియోగించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

CAPFs
'సీఏపీఎఫ్​ క్యాటీన్లలో ఇకపై స్వదేశీ ఉత్పత్తులే విక్రయం'

By

Published : May 13, 2020, 2:56 PM IST

సీఆర్​పీఎఫ్​, బీఎస్​ఎఫ్​ వంటి కేంద్ర సాయుధ దళాలు(సీఏపీఎఫ్​) క్యాంటీన్లలో జూన్​ 1 నుంచి కేవలం స్వదేశీ ఉత్పత్తులనే విక్రయించనున్నట్లు ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా. సుమారు 50 లక్షల మంది సైనికుల కుటుంబ సభ్యులు స్వదేశీ ఉత్పత్తులే వినియోగిస్తారని తెలిపారు.

ఆర్థిక స్వావలంబన సాధనే లక్ష్యంగా స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్​ చేశారు షా. సాధ్యమైనంత వరకు దేశీయ ఉత్పత్తులను వినియోగించేందుకే ప్రయత్నించాలని, ఇతరులను ఆ దిశగా ప్రోత్సహించాలని ప్రజలను కోరారు.

" సీఏపీఎఫ్​ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే విక్రయించాలని హోంశాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న సీఏపీఎఫ్​ క్యాంటీన్లలో 2020, జూన్​ 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో 10 లక్షల మంది సిబ్బంది కుటుంబాలు దేశీయ ఉత్పత్తులనే వినియోగిస్తారు. ప్రతి భారతీయుడు దేశంలో తయారైన ఉత్పత్తులనే ఉపయోగిస్తే.. ఐదేళ్లలో దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది."

–అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

కేంద్ర సాయుధ దళాలైన సీఆర్​పీఎఫ్​, బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ, ఎన్​ఎస్​జీ, అసోం రైఫిల్స్​ క్యాంటీన్లు అన్ని కలిసి ఏడాదికి రూ. 2,800 కోట్ల విలువైన వివిధ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details