తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'సంగ్రామం: ఆదిత్య ఠాక్రే ఆస్తులెంతో తెలుసా..? - భాజపా మహారాష్ట్ర విభాగ అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్ నామినేషన్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వేడి రాజుకుంది. ఠాక్రే కుటుంబం నుంచి మొదటిసారి ఆదిత్య ఠాక్రే... శివసేన తరపున ఎన్నికల్లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. నేడు నామినేషన్​ దాఖలు చేశారు. తన ఆస్తుల విలువ 16.05 కోట్లుగా ఎన్నికల ప్రమాణపత్రంలో పేర్కొన్నారు ఠాక్రే. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు.. చంద్రకాంత్​ పాటిల్​, ఎన్​సీపీ అభ్యర్థి ధనంజయ్​ ముండే కూడా ఇవాళ నామినేషన్లు వేశారు.

'మహా'సంగ్రామం: ఆదిత్య ఠాక్రే ఆస్తులెంతో తెలుసా..?

By

Published : Oct 3, 2019, 5:38 PM IST

శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే తనయుడు, యువసేన అధినేత ఆదిత్య ఠాక్రే ఇవాళ మహారాష్ట్ర వర్లీ నియోజకవర్గంలో నామినేషన్​ దాఖలు చేశారు. తనకు 16.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఠాక్రే కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి.

29 ఏళ్ల ఆదిత్య దాఖలు చేసిన అఫిడవిట్​లో రూ.4.67 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.11.38 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో రూ.10.36 కోట్ల బ్యాంకు డిపాజిట్లు, రూ.6.50 లక్షలు విలువ చేసే బీఎమ్​డబ్ల్యూ కారు ఉన్నాయని తెలిపారు. తనకు రూ. 64.65 లక్షల విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు.

శివసేన యువజన విభాగం అధినేత అయిన ఆదిత్య అఫిడవిట్​లో... 2011లో బ్యాచిలర్​ ఆఫ్​ ఆర్ట్స్​, 2015లో 'లా' పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని వెల్లడించారు.

భాజపా, ఎన్​సీపీ అభ్యర్థులు కూడా...

భాజపా మహారాష్ట్ర విభాగ అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్, ఎన్​సీపీ అభ్యర్థి ధనంజయ్ ముండే కూడా ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. పాటిల్​.. పుణెలోని కొత్రుద్​ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఎన్​సీపీ అభ్యర్థి ధనంజయ్​ ముండే పార్లీ సెగ్మెంట్​లో నామినేషన్​ దాఖలు చేశారు. దేశ్​ముఖ్​ సోదరులు... అమిత్​ దేశ్​ముఖ్​(కాంగ్రెస్​) లాతూర్​(పట్టణం)లో, ధీరజ్​ దేశ్​ముఖ్​ లాతూర్​(గ్రామీణం)లో నామినేషన్లు​ వేశారు. వీరికి మద్దతుగా తమ సోదరుడు, బాలీవుడ్ నటుడు రితీశ్​దేశ్​ముఖ్​ హాజరయ్యారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్​ దాఖలు చేసేందుకు శుక్రవారమే చివరి రోజు. అక్టోబర్ 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: ఆ నగరంలో ట్రాఫిక్​ జామ్​ అయితే ఆనందమే!

ABOUT THE AUTHOR

...view details