ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, చెన్నై అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఛైర్పర్సన్ శాంత కన్నుమూశారు. 93 ఏళ్ల శాంత.. ఛాతిలో నొప్పి రావడం వల్ల సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డాక్టర్ శాంతకు నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
"అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన క్యాన్సర్ చికిత్స అందించేందుకు డాక్టర్ శాంత చేసిన కృషి మరువలేనిది. పేదలకు చికిత్స అందించడంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడయార్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ సందర్భంగా 2018లో నేను ఆ ఆస్పత్రిని సందర్శించిన క్షణాలు గుర్తుచేసుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలి"
-నరేంద్ర మోదీ, ప్రధాని