బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు చేసుకోవడం తాము సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నాయి రైతు సంఘాలు. దీనిని ప్రభుత్వ ఓటమిగా అభివర్ణించాయి. బోరిస్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా తమకు మద్దతు లభిస్తుందని స్పష్టమైందని ప్రకటించుకున్నాయి.
"యూకే ప్రధాని భారత్ పర్యటన రద్దు.. మేము సాధించిన రాజకీయ విజయం, మోదీ సర్కారుకు దౌత్యపరమైన ఓటమి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక సంస్థల మద్దతు మాకు లభిస్తుంది. రైతుల ఉద్యమం ఇప్పుడు ప్రజాఉద్యమంగా మారబోతుంది" అని సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటనలో పేర్కొంది.