మహారాష్ట్ర పుణెలో కొవిడ్ ప్రభావిత ప్రధాన ప్రాంతాలు ఐదింటింలో 36 నుంచి 62 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్లు సిరో సర్వేలో తేలింది. అక్కడి నగరపాలక సంస్థలోని ఐదు వార్డుల్లో దీనిని నిర్వహించారు. బంగ్లాల్లో నివసించే వారిలో 43.9 శాతం మేర, మురికివాడలు, చిన్న చిన్న కాలనీల్లో నివాసం ఉంటున్న వారిలో 56-62 శాతం మేర సిరో పాజిటివిటీ కనిపించింది.
సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా - maha corona upDATE
దేశంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. అయితే ఇక్కడ సామాజిక మరుగుదొడ్లు వారిలో 62 శాతం మందికి వైరస్ సోకినట్లు సిరో సర్వేలో తేలింది.
సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62 శాతం మందికి కరోనా
అపార్ట్మెంట్లలో ఉన్న వారిలో 33 శాతం మందికి, సామాజిక మరుగుదొడ్లు ఉపయోగించే ప్రాంతాల్లో 62.2 శాతం మందికి వైరస్ సంక్రమించినట్లు వెల్లడైంది.