విద్వేష, హింసా రాజకీయాలకు విద్యా సంస్థలు స్వర్గధామాలు కాకూడదని అభిప్రాయపడ్డారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. విశ్వవిద్యాలయాల్లో చదువుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి కానీ వర్గ పోరు, విభజన ధోరణులకు కాదని హితవు పలికారు. దిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో ఆదివారం హింస చెలరేగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.
నేషనల్ అస్సెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(ఎన్ఏఏసీ) రజతోత్సవం సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకయ్య.
"మన పిల్లలు విద్యా సంస్థల నుంచి వారి చదువును పూర్తి చేసుకొని బయటకు వచ్చే సమయానికి మంచి పౌరులుగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వారిలా కనిపించాలి. ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా రూపొందాలి."