తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడి సైనికుల పట్ల నిర్లక్ష్యంపై కాగ్​ ఆక్షేపణ - సియాచిన్​, డోక్లామ్​,లద్ధాఖ్​ వంటి ఎత్తయిన ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలించనప్పుడు విధులు నిర్వర్తించే సైనికులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో లోపాలు ఉన్నాయని కాగ్​ ఆక్షేపించింది

సియాచిన్​, డోక్లామ్​,లద్ధాఖ్​ వంటి ఎత్తయిన ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలించనప్పుడు విధులు నిర్వర్తించే సైనికులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో లోపాలు ఉన్నాయని కాగ్​ ఆక్షేపించింది. కాగ్​ ప్రకటనపై రక్షణ శాఖ ఇంకా స్పందించలేదు.

soldiers
ఎత్తయిన ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి సైనికుల చిత్తు

By

Published : Dec 23, 2019, 6:37 AM IST

Updated : Dec 23, 2019, 7:30 AM IST

సియాచిన్‌, డోక్లామ్‌, లద్ధాఖ్‌ వంటి ఎత్తయిన ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల నడుమ విధులు నిర్వర్తించే సైనికులకు ప్రత్యేక దుస్తులు, సాధనాలు, ఆహారం సరఫరాలో కొరత, లోపాలు ఉన్నాయంటూ ‘కాగ్‌’ ఆక్షేపించింది. ఇలాంటి కారణాలతో మరణాలు, వైకల్యం పొందిన వారి వివరాలు చెప్పాలని రక్షణ శాఖను కోరింది. అయితే కాగ్‌ నివేదిక తయారయ్యే నాటికి కూడా రక్షణశాఖ నుంచి స్పందన రాలేదు.

సైన్యంలోని తూర్పు కమాండ్‌లో 9వేల అడుగుల ఎత్తులో మోహరించిన సైనికులకు ప్రత్యేక దుస్తులు, సాధనాలను ఇస్తారు. మిగతా కమాండ్‌లలో 6వేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో పనిచేసేవారికి వీటిని సమకూరుస్తారు. ఈ సాధనాల్లో ప్రత్యేక దుస్తులు, పర్వతారోహణ ఉపకరణాలు ఉంటాయి. 2015-16 నుంచి 2017-18 కాలంలో వీటి తీరుతెన్నులపై పరిశీలన జరిపిన కాగ్‌ తన నివేదికలో పలు దిగ్భ్రాంతికర అంశాలను వెలుగులోకి తెచ్చింది.

  • ఎత్తయిన ప్రాంతాల్లోని సైనికుల కళ్లను రక్షించేందుకు ఉపయోగించే ప్రత్యేక కళ్లద్దాలకు 5.56 నుంచి 16.07 శాతం మేర కొరత ఉంది. ఇవి లేకపోవడం వల్ల సైనికుల్లో దృష్టి సమస్యలు తలెత్తుతున్నాయి.
  • 12వేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో పనిచేసే సైనికులకు ఇవ్వాల్సిన ప్రత్యేక రేషన్‌ విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి చోట్ల శీతకాలాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 50 డిగ్రీల కన్నా తక్కువకు పడిపోతుంటాయి. దీనికితోడు గాలిలో ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సైనికులకు ఆకలి తగ్గిపోతుంది. శారీరకంగానూ మార్పులు జరుగుతాయి. ఫలితంగా బరువు తగ్గిపోవడం, పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వీరి మానసిక, శారీరక ఇబ్బందులను అధిగమించేలా కొన్ని రకాల ఆహార పదార్థాలను అందించాల్సి ఉంటుంది.
  • అక్కడి సైనికులకు నిర్దేశించిన ఆహార పదార్థాలకు బదులుగా ఖరీదైన ప్రత్యామ్నాయాలను సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు.

ఇదీ చూడండి : ముస్లిం మైనారిటీలకు భారత్​ రక్షణ కల్పించాలి: ఓఐసీ

Last Updated : Dec 23, 2019, 7:30 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details