తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతపై ప్రధాని అధ్యక్షతన కేబినెట్ కమిటీ

బుధవారం నరేంద్రమోదీ అధ్యక్షతన దేశ భద్రతపై నూతన కేబినెట్ కమిటీ ఏర్పాటైంది. ఇది జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

భద్రతపై ప్రధాని అధ్యక్షతన కేబినెట్ కమిటీ

By

Published : Jun 5, 2019, 11:20 PM IST

Updated : Jun 6, 2019, 6:10 PM IST

భద్రతపై ప్రధాని అధ్యక్షతన కేబినెట్ కమిటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతపై నూతన కేబినెట్​ కమిటీ ఏర్పాటైంది. అత్యంత కీలకమైన ఈ ప్యానెల్​... జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ప్రధాని అధ్యక్షుడుగా ఉన్న ఈ కమిటీలో రక్షణ,హోం,ఆర్థిక,విదేశీ వ్యవహారాల మంత్రులు సభ్యులుగా ఉంటారు.

ప్రస్తుత కేబినెట్​ కమిటీకి ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, హోంమంత్రి అమిత్​షా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్​.జైశంకర్​, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఈ కమిటీలో సభ్యులు.

నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు, లేదా కేబినెట్ పునర్ ​వ్యవస్థీకరించినపుడు... భద్రతపై ఈ కేబినెట్​ కమిటీ మారుతుంది.

ఇదీ చూడండి: కాస్త చోటు కోసం చిరుతల ఆధిపత్య పోరాటం

Last Updated : Jun 6, 2019, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details