తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ నిర్ణయాలతో రైతులు, కార్మికుల జీవితాల్లో మార్పు' - Narendra Modi news

కేంద్రమంత్రి​ వర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో రైతులు, కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో.. జై కిసాన్​ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా కీలక నిర్ణయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంఎస్​ఎంఈల సమస్యలు పరిష్కరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ఛాంపియన్స్​ పేరిట పోర్టల్​ను ప్రారంభించారు మోదీ.

Cabinet decisions will bring positive changes
'రైతులు, కార్మికుల జీవితాల్లో సానుకూల మార్పు'

By

Published : Jun 1, 2020, 8:24 PM IST

అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదిలో జరిగిన తొలి మంత్రివర్గ భేటీలో 'జై కిసాన్'​ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేబినెట్​ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో రైతులు, కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో సానుకూల మార్పు చోటుచేసుకుంటుందన్నారు. రైతులు, వీధి వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయని వరుస ట్వీట్లు చేశారు.

మోదీ ట్వీట్స్​

"ఆత్మనిర్భర్​ భారత్​ అభియాన్​ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు ఎంఎస్​ఎంఈల నిర్వచనాన్ని మార్చటమే కాదు, వాటిని పునరుద్ధరించేందుకు పలు ప్రతిపాదనలు ఆమోదించాం. అది చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మేలు చేయటంతో పాటు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. 'పీఎం వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్​ నిధి' చాలా ప్రత్యేకమైన పథకం. తొలిసారి వీధి వ్యాపారులు జీవనోపాధి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. రైతులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచాం. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచటంపై దృష్టి సారించాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఛాంపియన్స్​ పోర్టల్​..

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాటిని విజేతలుగా నిలిపేందుకు 'ఛాంపియన్స్' (క్రియేషన్​ ఆఫ్​ హార్మోనియస్​ అప్లికేషన్​ ఆఫ్​ మోడర్న్​ ప్రాసెసెస్​ ఫర్​ ఇంక్రీసింగ్​ ద ఔట్​పుట్​ అండ్​ నేషనల్​ స్ట్రేంత్​)​ పేరిట సాంకేతిక ఫ్లాట్​ఫాంను ప్రారంభించారు ప్రధాని మోదీ. సమస్యలు పరిష్కారించి, ప్రోత్సాహం అందించటం ద్వారా చిన్న సంస్థలను పెద్దవిగా మార్చటం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఇవ్వగల సంస్థలను గుర్తించి ప్రోత్సహించటం ఈ పోర్టల్​ ముఖ్య ఉద్దేశం.

ఛాంపియన్స్​ పోర్టల్​ ప్రారంభిస్తున్న మోదీ

ABOUT THE AUTHOR

...view details