వ్యయసాయ ఉత్పత్తులపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం.. గ్రామీణ భారతానికి సానుకూల ఫలితాన్నిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. రైతులు పండించిన పంటల కొనుగోలు, అమ్మకాలపై ఉన్న ఆంక్షలను కేంద్రం తొలగించి.. దశాబ్దాలుగా ఉన్న రైతుల డిమాండ్లను నెరవేర్చిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు వ్యవసాయ సంస్కరణలు దోహదపడతాయని ప్రధాని చెప్పుకొచ్చారు. వ్యవసాయ ఉత్పత్తి, వాణిజ్య రంగాలకు విస్తృత మార్కెట్ కల్పించే దిశగా "ఒకే దేశం-ఒకే మార్కెట్" విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం మరింత సుగమం అవుతుందన్నారు.