దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరో అవగాహనా కార్యక్రమం నిర్వహించనుంది కేంద్రం. మాస్కులు ధరించడం, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటి అంశాలపై గురువారం నుంచి ప్రచారం చేయనున్నట్టు కేంద్రమంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడించారు మంత్రి ప్రకాశ్ జావడేకర్.
కరోనాపై అవగాహనకు కేంద్రం మరో కార్యక్రమం - Prakash Javadekar today news
దేశంలో కొవిడ్ నిర్మూలనకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గురువారం నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది.
కరోనాపై అవగాహన కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం
వ్యాక్యిన్ వచ్చేవరకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు జావడేకర్. రద్దీగా ఉండే విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌డిపోలు, పోలీస్ స్టేషన్లు, మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఏకకాలంలో ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు జావడేకర్.
ఇదీ చదవండి:74% మందికి వార్తా ఛానళ్లే వినోదానికి వేదిక