తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయాలు - జమ్ముకశ్మీర్

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. జమ్ముకశ్మీర్​ రిజర్వేషన్​ సవరణ ఆర్డినెన్స్​ను ఆమోదించింది కేబినెట్​.

కేంద్ర మంత్రివర్గంలో మాట్లాడుతున్న అరుణ్​జైట్లీ

By

Published : Feb 28, 2019, 11:41 PM IST

Updated : Mar 1, 2019, 12:09 AM IST

దేశ సరిహద్దుల్లోని వారికి సైతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. జమ్ముకశ్మీర్​ రిజర్వేషన్​ సవరణ ఆర్డినెన్స్​కు ఆమోదం లభించింది.

కేంద్రం కీలక నిర్ణయాలు

"ఆర్డినెన్స్​ అమల్లోకి వస్తే అంతర్జాతీయ సరిహద్దుల్లోని వారికి సైతం రిజర్వేషన్లు అమలువుతాయి. విద్యా, ఉద్యోగాల్లో జమ్ము కశ్మీర్​లో ఇప్పటి వరకు అందుతున్న రిజర్వేషన్లతో పాటు మరో 10 శాతం ఆర్థికంగా వెనకబడిన వారికి అందనున్నాయి."

- అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి

రూ.8 వేల కోట్లతో ఆగ్రా మెట్రో రైల్‌ ప్రాజెక్టు, రెండు కారిడార్లతో కాన్పుర్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని తెలిపారు జైట్లీ. బ్రహ్మపుత్ర నదిపై 4 వరుసల వంతెన, హరియాణా మనేథీలో ఎయిమ్స్‌ నిర్మాణం, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, హిరసార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Last Updated : Mar 1, 2019, 12:09 AM IST

ABOUT THE AUTHOR

...view details