తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిజిటల్​ మీడియాలో 26 శాతం ఎఫ్​డీఐలకు కేంద్రం ఆమోదం - నార్త్​బ్లాక్​

కేంద్ర కేబినెట్​ భేటీ

By

Published : Aug 28, 2019, 7:11 PM IST

Updated : Sep 28, 2019, 3:31 PM IST

19:22 August 28

సీఆర్​డీఐ వ్యవస్థకు కేంద్రం పచ్చజెండా

విపత్తుల నిర్వహణకు అంతర్జాతీయ సహకారం తీసుకుంటాం: జావడేకర్‌

సీడీఆర్‌ఐ వ్యవస్థకు కేంద్రం పచ్చజెండా: జావడేకర్‌

వచ్చే నెల 23న జరిగే ఐరాస సదస్సులో మోదీ సీడీఆర్‌ఐను ప్రారంభిస్తారు: జావడేకర్‌

19:18 August 28

ఎఫ్​డీఐ నిబంధనల సరళీకరణ: గోయల్​

  • ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించి... పెట్టుబడులను పెంచాం: పీయూష్‌ గోయల్‌
  • మేకిన్‌ ఇండియా నినాదంలో భాగంగా ఎగుమతులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నాం
  • ప్రింట్‌ మీడియాలో ఉన్న 26 శాతం ఎఫ్‌డీఐల అనుమతిని డిజిటల్ మీడియాకు కూడా విస్తరిస్తున్నాం
  • బొగ్గు గనుల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి: పీయూష్ గోయల్‌
  • రిజర్వ్‌ బ్యాంక్‌ మిగులు నిధులకు సంబంధించిన విస్తృతంగా చర్చించాం
  • ఆర్‌బీఐ నిధులకు సంబంధించి శుక్రవారం నాడు కీలక నిర్ణయం ఉంటుంది

19:15 August 28

తయారీ రంగం హబ్​గా భారత్​: పీయూష్​ గోయల్​

బొగ్గు గనుల తవ్వకాలు, దానికి సంబంధించిన మౌలిక వసతుల్లో స్వయం చాలక మార్గంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం ఆమోదించింది. ఒప్పంద తయారీ రంగంలో కూడా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతినిచ్చింది.

కేబినెట్​ నిర్ణయాలు పీయూష్​ మాటల్లో...

  • గతంలో విదేశీ మారక నిల్వలు సున్నా స్థాయికి పడిపోయాయి.
  • మోదీ హయాంలో విదేశీ మారక నిల్వలు 280 మిలియన్‌ డాలర్లకు చేరాయి.
  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
  • తయారీరంగం హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతున్నాం.
  • ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించి పెట్టుబడులను పెంచాం.
  • మేకిన్‌ ఇండియాలో భాగంగా ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.

19:14 August 28

కేంద్రం కీలక నిర్ణయాలు

  • పంచదార ఎగుమతి విధానానికి కేంద్రం అంగీకారం
  • మిగులు పంచదారను 2019-20 సీజన్‌లోగా ఎగుమతి చేస్తాం: జావడేకర్‌
  • ఈ సంవత్సరంలో 60 లక్షల టన్నుల పంచదారను ఎగుమతి చేస్తాం: జావడేకర్‌

18:22 August 28

డిజిటల్​ మీడియాలో 26 శాతం ఎఫ్​డీఐలకు కేంద్రం ఆమోదం

2021-22 కల్లా దేశవ్యాప్తంగా కొత్తగా 75 వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు వైద్య కళాశాలు లేని జిల్లాల్లో వీటిని నిర్మించనున్నారు. ఇందుకోసం 24 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. వీటివల్ల కొత్తగా 15 వేల 700 ఎంబీబీఎస్​ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

కేబినెట్​ నిర్ణయాలు...

  • దేశంలో 75 కొత్త వైద్యకళాశాలలకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా
  • 2021-22లోగా కొత్త వైద్యకళాశాలల నిర్మాణం పూర్తి చేస్తాం: జావడేకర్​
  • వీటివల్ల 15,700 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా వస్తాయి.
  • చెరకు రైతులను ఆదుకునేందుకే అనేక చర్యలు తీసుకున్నాం.
  • చెరకు రైతులకు రూ.6 వేల కోట్ల ఎగుమతి రాయితీ ఇస్తాం.
Last Updated : Sep 28, 2019, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details