తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గెజిట్ నోటిఫికేషన్​తో అమల్లోకి సీఏఏ - జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చిన సీఏఏ

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్​ నోటిఫికేషన్ జారీ చేసింది.

CAA STARTS FROM JANUARY 10
గెజిట్ నోటిఫికేషన్​తో అమల్లోకి వచ్చిన సీఏఏ

By

Published : Jan 11, 2020, 5:24 AM IST

Updated : Jan 11, 2020, 7:38 AM IST

పాకిస్థాన్​, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 10వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈ నోటిఫికేషన్‌లో కేంద్రం తెలిపింది.

సీఏఏని గత నెల 11న పార్లమెంటు ఆమోదించగా, అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:ఇవాళ ప్రధాని మోదీ, మమతా బెనర్జీ భేటీ!

Last Updated : Jan 11, 2020, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details