తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ హింసకు కాంగ్రెస్ బాధ్యత వహించాలి: షా

పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చి అల్లర్లు సృష్టించారని విపక్షాలపై మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దిల్లీలో జరిగిన హింసకు కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

-అమిత్​ షా, కేంద్ర హోమంత్రి
-అమిత్​ షా, కేంద్ర హోమంత్రి

By

Published : Dec 26, 2019, 2:31 PM IST

కాంగ్రెస్ సహా 'పౌర' నిరసనల్లో పాల్గొన్న విపక్షాలపై విరుచుకుపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. పార్లమెంటులో బిల్లుపై చర్చకు వచ్చినప్పుడు మాట్లాడకుండా.. బయటికి వచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

దిల్లీలో జరిగిన దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ(డీడీఏ) కార్యక్రమంలో పాల్గొన్నారు షా. దిల్లీలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

-అమిత్​ షా, కేంద్ర హోమంత్రి

"పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. అప్పడు ఎవరూ ఏమీ మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. వాళ్లలో వాళ్లే ముచ్చటించుకున్నారు. బయటికి వచ్చాక బిల్లుపై అసత్యాలను ప్రచారం చేయటం ప్రారంభించారు. దిల్లీలో శాంతికి భంగం కలిగించారు.ఇందుకు బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలు. ఇందుకు వారిని శిక్షించే సమయం వచ్చింది. దిల్లీ ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి."

-అమిత్​ షా, కేంద్ర హోమంత్రి

ABOUT THE AUTHOR

...view details